
జనరల్

అన్నమయ్య జిల్లా ములకలచెరువులోని రాజీవ్ కాలనీకి చెందిన చిన్నారి చంద్రిక అంతుచిక్కని వ్యాధితో బాధపడుతోంది. ఆమె పరిస్థితిపై వెలువడిన కథనానికి స్పందించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను అప్రమత్తం చేయడంతో చిన్నారికి వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి.
డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్య ఆదేశాల మేరకు ఆదివారం 108 అంబులెన్స్‌లో చంద్రికను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి పిల్లల వార్డులో చేర్చారు. వైద్య నిపుణుల బృందం రక్త నమూనాలు, కంటిపై ఉన్న గడ్డ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపింది. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్సతో పాటు భోజనం, వసతి కల్పిస్తామని అధికారులు తెలిపారు. తమ కుమార్తెకు వైద్య సేవలు అందుతున్నందుకు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!