
బిజినెస్

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న ఆణివార ఆస్థానం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి అత్యంత సుందరంగా అలంకరించిన పుష్పపల్లకిపై తిరుమల మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని జూలై 17న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ దర్శన, సేవల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని టీటీడీ సూచించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!