

భారత్‌లో సోలార్ పవర్ కాంట్రాక్టులకు సంబంధించిన లంచం ఆరోపణల కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలకు అమెరికా కోర్టు తీర్పుతో ఊరట లభించింది. 2024లో నమోదైన ఈ కేసులో అదానీ గ్రూప్ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చేందుకు కుట్ర పన్నిందని, తద్వారా సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందిందని అమెరికా అధికారులు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని అమెరికా ఇన్వెస్టర్లకు దాచిపెట్టి మోసం చేశారనే ఆరోపణలు కూడా కేసులో ఉన్నాయి.
అయితే ఈ వ్యవహారం అమెరికా చట్టాల పరిధిలోకి రాదని పేర్కొంటూ అమెరికా న్యాయ శాఖ కేసును ఉపసంహరించుకుంది. ప్రాసిక్యూషన్ కేసును కొనసాగించకూడదని నిర్ణయించినప్పటికీ, న్యాయమూర్తి అధికారికంగా ఆమోదించే వరకు ఆరోపణలు పెండింగ్‌లో ఉంటాయి. తాజాగా కోర్టు తీర్పు వెలువరించడంతో అదానీ, సాగర్ అదానీలపై కొనసాగుతున్న ఈ కేసు ప్రక్రియకు ముగింపు లభించినట్లయింది. దాదాపు రెండేళ్లుగా సాగిన ఈ న్యాయపరమైన వ్యవహారంలో తాజా తీర్పు వారికి కీలకమైన ఊరటగా నిలిచింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!