
సినిమాలు

పాకిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు జరిపింది. బలోచిస్థాన్‌లోని పిషిన్ జిల్లా సరనాన్ ప్రాంతంలో ఉన్న ఐసిస్ జాయింట్ సెంటర్‌తో పాటు ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. తూర్పు అఫ్గాన్‌పై పాకిస్థాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో పలువురు ఐసిస్ సభ్యులు మరణించినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, అఫ్గాన్ నుంచి వచ్చిన నాలుగు డ్రోన్‌లను తమ సైన్యం అడ్డుకున్నట్లు పాక్ వెల్లడించింది. సరనాన్‌లోని ఓ పాఠశాల సమీపంలో డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయని తెలిపింది. ఇలాంటి చర్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని తాలిబన్లను హెచ్చరించింది. ఐసిస్ పాక్ భూభాగాన్ని వాడుకుంటోందన్న అఫ్గాన్ ఆరోపణలను పాక్ ఖండించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!