
సినిమాలు

నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు లేఖ విడుదల చేశారు. తమ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ముఖ్య అతిథులుగా హాజరు కావడం తమకు ఇష్టం లేదని వారు తెలిపారు.
మనన్ కుమార్ మిశ్రా విద్యార్థులు, ఉపాధ్యాయులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని నల్సార్ విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే బీసీఐ అధికారిక లెటర్‌హెడ్‌ను మనన్ కుమార్ మిశ్రా ఎందుకు ఉపయోగించారో వివరణ ఇవ్వాలని కోరుతూ బీసీఐకి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై బీసీఐ స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!