

మహీంద్రా భారత మార్కెట్ కోసం ‘స్కార్పియో లైఫ్‌స్టైలర్’ పేరుతో కొత్త పికప్ ట్రక్‌ను ఆవిష్కరించింది. టయోటా హైలక్స్‌కు గట్టి పోటీ ఇచ్చేలా రూపొందించిన ఈ వాహనం, గతంలో ప్రదర్శించిన గ్లోబల్ పిక్ అప్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ డబుల్ క్యాబ్ పికప్ ట్రక్‌లో ఆఫ్‌రోడ్ సామర్థ్యానికి అనుగుణంగా బలమైన ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను అందించనున్నారు. ఇది 2027 ఏప్రిల్ నాటికి అధికారికంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
స్కార్పియో లైఫ్‌స్టైలర్ ప్రారంభ ధర రూ.19.79 లక్షల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం. విశాలమైన ఇంటీరియర్‌తో పాటు పెద్ద టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. కఠినమైన పనులకు ఉపయోగపడే పికప్ ట్రక్ ప్రాక్టికాలిటీతో పాటు కుటుంబ SUV తరహా సౌకర్యం, ప్రీమియం అనుభూతిని అందించడం ద్వారా కొనుగోలుదారులను ఆకట్టుకోవాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!