
జనరల్

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. తనకు పోలీసులు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉందని, అందుకే విచారణకు స్వచ్ఛందంగా హాజరవుతున్నానని తెలిపారు.
తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతున్నందున అన్ని వివరాలను వెల్లడించలేనని చెప్పారు. నిజాలు వెలుగులోకి వస్తాయని, న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!