

వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో నిర్వహించిన సచివాలయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి ఛైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం చేసి, కొందరికి ప్రాధాన్యం ఇచ్చి ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
2019 సచివాలయ పరీక్షల్లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 పరీక్షకు హాజరైన ఒక అభ్యర్థి 150 మార్కులకు 112.5 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం పొందిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే వివిధ విభాగాల్లో వచ్చిన ర్యాంకులపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. గతంలో 90 శాతం ఉద్యోగాలు తమ అనుచరులకే వచ్చాయని చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, నియామకాల ప్రక్రియపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!