
టెక్నాలజీ

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లాలోని తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. భారీ వరద నీటితో జలపాతం నిండుకుండలా మారి అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తున్నప్పటికీ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
సుమారు 160 మీటర్ల వెడల్పు, 50 అడుగుల ఎత్తు నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం వద్ద ఏర్పాటు చేసిన రక్షణ వలయం కారిడార్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా అధికారులు బొగత జలపాత సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!