9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

Writer: Nithish 06:33 AM, 9 అక్టోబర్, 2026
ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు దేశంలోనే అగ్రగామి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే విధానాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దిల్లీలో గురువారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే సంవత్సరాల్లో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఏపీలో 15 శాతం ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత 24 నెలల్లో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 714 ప్రాజెక్టులను సాధించామని, వీటిలో రూ.16.6 లక్షల కోట్ల విలువైన 473 ప్రాజెక్టులకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశామని వివరించారు. రూ.4.7 లక్షల కోట్ల విలువైన 247 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని, వాటి ద్వారా సుమారు 7.1 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు.

పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఆన్‌లైన్‌లో రియల్‌టైమ్‌లో జమ చేసే విధానాన్ని నవంబర్‌ 12న విశాఖపట్నంలో ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి నదుల అనుసంధానంతో పలు రాష్ట్రాల్లో నీటి కొరతను తగ్గించవచ్చని పేర్కొన్నారు. 500 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 110 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చిలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తిరుపతిలో సెమీకండక్టర్‌ రంగానికి 10 వేల ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ, భారత్‌ అభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని, విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌, అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యాలీ వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి అవకాశాలను పెంచుతున్నాయని తెలిపారు. విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సులో పారిశ్రామికవేత్తలు పాల్గొని ఏపీలోని అవకాశాలను పరిశీలించాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు

మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ

బెంగళూరులో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన.. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌

బెంగళూరులో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన.. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడుసీఐఐ భాగస్వామ్య సదస్సు 2026ఏపీ పెట్టుబడులుఆర్థిక వృద్ధిపారిశ్రామిక అభివృద్ధిగ్రీన్ ఎనర్జీగూగుల్ డేటా సెంటర్పోలవరం ప్రాజెక్టుపీయూష్ గోయల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు
జనరల్

మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ
జనరల్

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ

బెంగళూరులో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన.. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌
జనరల్

బెంగళూరులో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన.. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన
జనరల్

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి
రాజకీయాలు

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి
రాజకీయాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల
జనరల్

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ టాక్
సినిమాలు

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ టాక్

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి
జనరల్

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం
జనరల్

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!