

రాష్ట్ర అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. రూ.40 కోట్ల వ్యయంతో 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేలా అగ్నిమాపక శాఖను ఆధునికీకరించడంలో భాగంగా ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలను వినియోగించనున్నారు. పెద్ద అగ్నిప్రమాదాల సమయంలో మంటలను అదుపు చేసేందుకు నిరంతర నీటి సరఫరా కోసం 20 వాటర్ బౌజర్లు ఉపయోగపడనున్నాయి. ఇరుకైన, రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేందుకు 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలు ఉపయోగపడతాయి. తొలి దశలోనే ప్రభుత్వం రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!