

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు లాస్ ఏంజెలెస్‌లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్సుకు రానున్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సమయంలో ప్రాంగణం సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వాహనంలో తుపాకీ, మందుగుండు సామగ్రి లభించడంతో వెంటనే అరెస్ట్ చేశారు.
డౌనీ నగరానికి చెందిన 38 ఏళ్ల జీనైన్ జాన్ టేలేగా అనుమానితుడిని గుర్తించారు. అనంతరం అతడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో తుపాకులు, మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతడు గోల్ఫ్ కోర్సు వద్దకు ఏ ఉద్దేశంతో వచ్చాడనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్రవాద కుట్ర లేదా ఇతర భద్రతా ముప్పు కోణంలోనూ విచారణ జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు అధికారులు ఎలాంటి అధికారిక నిర్ధారణ చేయలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!