

సైబర్ నేరగాళ్ల మోసాలకు గురై ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కోల్పోకుండా కేంద్ర టెలికాం శాఖ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్‌ఆర్‌ఐ) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది మే 22న ప్రారంభమైన ఈ వ్యవస్థ అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి అడ్డుకోవడంలో కీలకంగా పనిచేస్తోంది.
టెలికాం శాఖకు చెందిన డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఎఫ్‌ఆర్‌ఐ వ్యవస్థను రూపొందించారు. 15 నెలల వ్యవధిలో రూ.5,043.73 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను అడ్డుకున్నట్లు సమాచారం. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య నాలుగు నెలల్లోనే రూ.2 వేల కోట్లకు పైగా సొమ్ము సైబర్ నేరగాళ్లకు బదిలీ కాకుండా నిలువరించింది. ఎవరైనా అనుమానాస్పద మొబైల్ నంబర్‌కు డబ్బు పంపేందుకు ప్రయత్నించినప్పుడు ఎఫ్‌ఆర్‌ఐ వెంటనే హెచ్చరిస్తుంది. అవసరమైతే లావాదేవీని నిలిపివేయడం ద్వారా వినియోగదారులకు రక్షణ కల్పిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!