

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం రాత్రి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీలు సీఎం రమేష్, దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘనస్వాగతం పలికారు. బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో విమానాశ్రయ ప్రాంగణం సందడిగా మారింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా నితిన్ నబీన్‌కు స్వాగతం పలికారు. భోగాపురం విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ఆగస్టు 17న ప్రారంభమైన నేపథ్యంలో నితిన్ నబీన్ తొలిరోజే విమానాశ్రయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై చర్చించేందుకు మంగళవారం విశాఖపట్నంలో రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నితిన్ నబీన్ హాజరుకానున్నారు. మధురవాడలోని వైజాగ్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాట్లను పీవీఎన్ మాధవ్, పార్టీ ముఖ్యనేతలు సోమవారం పరిశీలించారు. అలాగే విశాఖలోని గ్రాండ్ బే హోటల్‌లో నిర్వహించనున్న ‘యువ సంవాదం’ కార్యక్రమ ఏర్పాట్లను కూడా వారు సమీక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!