

టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఆగస్టు 18న జరగాల్సి ఉండగా, కీలక వాటాదారు సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్ఆర్టీటీ) ప్రతినిధిని నామినేట్ చేయలేకపోవడంతో సమావేశంపై అనిశ్చితి నెలకొంది. మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన ఆంక్షల కారణంగా ఎస్ఆర్టీటీ బోర్డు సమావేశం నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏజీఎంకు అవసరమైన కోరం విషయంలో సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాగా, ఎన్. చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరిలో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఇదిలా ఉండగా, టాటా పవర్ తదుపరి తరం ఇంధన సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధన పరిష్కారాల్లో పరిశోధన, ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ఐఐటీ బాంబేతో మాస్టర్ రీసెర్చ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. ఈ భాగస్వామ్యం ద్వారా కొత్త ఇంధన సాంకేతికతల అభివృద్ధి, విస్తరణ, వాణిజ్యీకరణకు సంబంధించిన పరిశోధనలకు ఊతం ఇవ్వనున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!