
క్రీడలు

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బ్యాటర్ కేశర నువాంతా వికెట్ తీయడం ద్వారా టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 2012లో టెస్టు అరంగేట్రం చేసిన జడేజా.. 90వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. దీంతో టెస్టుల్లో భారత్ తరఫున 350కి పైగా వికెట్లు తీసిన ఐదో బౌలర్గా నిలిచాడు.
జడేజా కంటే ముందు అనిల్ కుంబ్లే 619, రవిచంద్రన్ అశ్విన్ 537, కపిల్ దేవ్ 434, హర్భజన్ సింగ్ 417 వికెట్లు పడగొట్టారు. ఇదే సమయంలో టెస్టుల్లో 4,000కు పైగా పరుగులు, 350కి పైగా వికెట్లు సాధించిన నాలుగో క్రికెటర్గా కూడా జడేజా నిలిచాడు. ఈ అరుదైన జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియల్ వెటోరీల సరసన జడేజా చేరాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!