

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ తొలిరోజు ఆతిథ్య భారత్‌కు మరపురాని విజయాలను అందించింది. 21 ఏళ్ల భారత ఆటగాడు ఆయుష్ శెట్టి సంచలన ప్రదర్శనతో గత ఏడాది విజేత, చైనా స్టార్ షి యుకిని ఓడించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆయుష్ 21-14, 13-21, 21-19తో ప్రపంచ నంబర్‌వన్ షి యుకిపై విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. కీలక సమయాల్లో అద్భుతంగా ఆడిన ఆయుష్ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
మరోవైపు మహిళల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ చాంపియన్, తొమ్మిదో సీడ్ పీవీ సింధు కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఐర్లాండ్‌కు చెందిన 141వ ర్యాంకర్ సోఫియా నోబుల్‌ను 21-7, 21-11తో వరుస గేముల్లో ఓడించింది. డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ, సిమ్రాన్-కవిప్రియ జోడీలు, పురుషుల డబుల్స్‌లో అర్జున్-హరిహరన్ ద్వయం కూడా తొలి రౌండ్‌లో విజయాలు సాధించాయి. దీంతో ఆతిథ్య భారత్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఘనంగా బోణీ కొట్టింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!