
సినిమాలు

శంషాబాద్ సమీపంలోని బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసన మరింత ఉధృతమైంది. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళన మధ్య హైడ్రా అధికారులు భూముల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నష్టపరిహారం, పునరావాసం తదితర అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూములు అప్పగిస్తామని రైతులు స్పష్టం చేశారు.
భూసేకరణకు ముందు అధికారులతో చర్చలు జరిపి రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో రైతుల ఉద్యమానికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడంతో ఈ అంశం రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!