

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ చిత్రం కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, అనంతరం నటించిన ‘కింగ్‌డమ్’, ‘కాంత’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. అయితే తాజాగా విడుదలైన ‘లెనిన్’ విజయం ఆమెకు ఊపిరి పోసినట్లైంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సక్సెస్‌తో భాగ్యశ్రీ కెరీర్ మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం భాగ్యశ్రీ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ‘లెనిన్’ విజయానంతరం తన పారితోషికాన్ని కూడా పెంచినట్లు సమాచారం. గతంలో ఒక్కో సినిమాకు రూ. 1.5 కోట్లు తీసుకున్న ఆమె, ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు రూ. 2.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్న ఈ హీరోయిన్, ఇతర భాషల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా శివకార్తికేయన్ సరసన ‘సేయోన్’ చిత్రంలో నటిస్తూ తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న భాగ్యశ్రీ బోర్సే రానున్న రోజుల్లో మరింత బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!