
రాజకీయాలు

తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కె. వెంకటరామిరెడ్డి (కేవీఆర్)ను బాడంగి పోలీసులు విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టులో హాజరుపరిచారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ చేసిన కేవీఆర్‌ను న్యాయమూర్తి ఈ నెల 14 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను బొబ్బిలి జైలుకు తరలించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విజయనగరం జిల్లా బాడంగి మాజీ సర్పంచ్ కండి రమేశ్ ఫిర్యాదు మేరకు, కేవీఆర్‌ను హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. భారత రాజ్యాంగం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో పోలీసులు ఇంటికే వెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!