
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలు, బాధ్యుల నిర్లక్ష్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, విచారణ కమిటీ నేడు స్టీల్ ప్లాంట్‌కు చేరుకుని పరిశీలన చేపట్టనుంది. ఘటనకు గల కారణాలు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక సమర్పించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!