
జనరల్

నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం 10 మంది విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కమిటీ నీట్ పరీక్షల నిర్వహణను సమగ్రంగా సమీక్షించి పలు కీలక సూచనలు చేయనుంది.
పరీక్షలలో పారదర్శకత, భద్రత, నిర్వహణ ప్రమాణాల మెరుగుదలపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. కమిటీ నివేదిక ఆధారంగా నీట్ పరీక్షల విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్కరణలతో వైద్య ప్రవేశ పరీక్షలపై విద్యార్థుల విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!