
క్రీడలు

చైనా విద్యా రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విద్యను తప్పనిసరి చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. తొలి తరగతి నుంచే విద్యార్థులు ప్రతి విద్యా సంవత్సరంలో 8 నుంచి 10 గంటల వరకు AI పాఠాలను అభ్యసించాల్సి ఉంటుంది.
ప్రాథమిక స్థాయిలో బ్లాక్ ప్రోగ్రామింగ్, ఇమేజ్ రికగ్నిషన్ రోబోట్స్, స్మార్ట్ డివైజ్‌ల వినియోగం వంటి అంశాలను బోధించనున్నారు. మధ్య తరగతుల్లో జనరేటివ్ AI ఆధారిత ప్రాజెక్టులు, డేటా మేనేజ్‌మెంట్‌పై శిక్షణ ఇవ్వగా, ఉన్నత పాఠశాలల్లో మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్స్, AI నైతికత వంటి ఆధునిక అంశాలను పరిచయం చేయనున్నారు. 2030 నాటికి ప్రపంచ AI శక్తిగా ఎదగడమే చైనా లక్ష్యంగా పెట్టుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!