

బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్ర టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన సీఎం, క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.
అధికారుల సమాచారం ప్రకారం, నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీకి వెళ్తున్న బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. బాధితులకు అన్ని విధాల సహాయం అందేలా బీహార్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. తీవ్రంగా గాయపడిన వారిని గయాలోని అనుగ్రహ నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!