
బిజినెస్

దిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడంపై భాజపా సీనియర్ నేత, మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. మురళీ మనోహర్ జోషి స్పందించారు. విద్యా వ్యవస్థపై విద్యార్థులు వ్యక్తం చేస్తున్న ఆవేదన నిజమైనదని, వారి సమస్యలను సానుభూతితో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల నిరసనలను కేవలం శాంతిభద్రతల సమస్యగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవడం సరైంది కాదని జోషి అన్నారు. విద్యార్థుల అభిప్రాయాలను విని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!