
జనరల్

మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని సీఎంకు వివరించారు. నిర్ణయించిన గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, చెరువు నుంచి మూసీ నదిలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాను విస్తరించాలని సూచించారు.
మీరాలం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు అనువైన డిజైన్‌ను సిద్ధం చేయడంతో పాటు, అక్కడి దీవులను కూడా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున పర్యాటకులను ఆకర్షించేలా చెరువు పరిసరాల్లో సుందరీకరణ, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!