

మహిళల హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు దూరమైన భారత జట్టు గురువారం చివరిసారిగా బరిలోకి దిగనుంది. ఐదో స్థానం కోసం జరిగే ప్లేఆఫ్‌లో జర్మనీతో సలీమా టెటె నేతృత్వంలోని భారత జట్టు తలపడనుంది. సెమీస్‌కు చేరలేకపోయినప్పటికీ, టోర్నీలో తమ ప్రస్థానాన్ని విజయంతో ముగించాలని భారత అమ్మాయిలు పట్టుదలగా ఉన్నారు. 1974లో సెమీఫైనల్‌కు చేరిన తర్వాత ప్రపంచకప్‌లో ఇదే భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. అయితే టోర్నీకి ముందు జర్మనీతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓటమిపాలైన నేపథ్యంలో గురువారం పోరు ఆసక్తికరంగా మారింది.
ఈ ప్రపంచకప్‌లో భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడగా.. నెదర్లాండ్స్‌పై మాత్రమే ఓడింది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాటు మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఇతర సమీకరణాలు అనుకూలించకపోవడంతో సెమీఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ముఖ్యంగా భారత రక్షణశ్రేణి టోర్నీ అంతటా ఆకట్టుకుంది. సీనియర్ గోల్‌కీపర్ సవితతో పాటు బిచు దేవి నెట్ వద్ద కీలకమైన సేవ్‌లు చేసి జట్టును ఆదుకున్నారు. మరోవైపు 11 మంది క్రీడాకారిణులు తొలిసారి భారత్ తరఫున ప్రపంచకప్‌లో ఆడటం భవిష్యత్తుకు సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!