
రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వల్ప ప్రమాదం తప్పింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని బుధవారం హైదరాబాద్‌కు బయలుదేరిన ఆయన ప్రయాణించిన విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌కు ముందుగా సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు సమాచారం. వాతావరణం అనుకూలించే వరకు పైలట్లు విమానాన్ని గాల్లోనే కొనసాగించారు.
ఆ సమయంలో విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 226 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం రాత్రి 8:35 గంటలకు విమానం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎలాంటి సాంకేతిక లోపం లేదా ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!