
షోస్

వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రకృతిని దైవ స్వరూపంగా భావించడం, నదులు, వృక్షాలు, పర్వతాలు, జీవరాశులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని పేర్కొన్నారు. వినాయకుడి పూజలో ఉపయోగించే పత్రి, పుష్పాలు ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీకలని తెలిపారు.
వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. సంప్రదాయబద్ధంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!