
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 16న మేడారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన మేడారంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయంత్రం మేడారంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనతో మేడారం ప్రాంతంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!