

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మరో ఆసక్తికరమైన మలుపు తిరిగినట్లు సమాచారం. కేవలం రెండు రోజుల క్రితమే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ బయటకు వచ్చేశాడనే టాక్ వినిపిస్తోంది. హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అతడికి నగదు ఆఫర్ ఇచ్చారని, చివరకు రూ.15 లక్షల వరకు ఆఫర్ వెళ్లినట్లు సమాచారం.
నవరసాలు ఆర్కేతో నిర్వహించిన టాస్క్‌లో గెలిచిన తర్వాత మిథిలేష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు, హౌస్‌లోని కంటెస్టెంట్లు వేసిన ఓట్ల ఆధారంగా అపూర్వకు అవకాశం లభించింది. తాజా సమాచారం ప్రకారం, వీకెండ్ ఎపిసోడ్‌లో మిథిలేష్‌కు సూట్‌కేస్‌లో నగదు పెట్టి, దాన్ని తీసుకుని హౌస్ నుంచి వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొదట రూ.5 లక్షలు, ఆ తర్వాత రూ.10 లక్షలు, చివరకు రూ.15 లక్షల వరకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తామని చెప్పడంతో మిగతా కంటెస్టెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మిథిలేష్ నిజంగానే డబ్బు తీసుకుని బయటకు వచ్చాడా, లేక స్టేజ్‌పై మరో ట్విస్ట్ చోటు చేసుకుంటుందా అనేది ఎపిసోడ్ ప్రసారమైన తర్వాతే స్పష్టమవుతుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!