
సినిమాలు

చెన్నైలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. పరాందూర్‌లో రెండో విమానాశ్రయం నిర్మించాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో రాజకీయంగా, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పరాందూర్‌లో విమానాశ్రయం నిర్మించవద్దంటూ నిరసనలు చేపట్టిన ప్రజల డిమాండ్లకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విజయ్ స్పష్టం చేశారు.
విమానాశ్రయం నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన ప్రజలకు సీఎం విజయ్ తన మద్దతు ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ప్రజల అభిప్రాయాలు, వారి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పరాందూర్ విమానాశ్రయ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం ద్వారా నిరసనకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!