
సినిమాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన, మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన అంశం, పార్టీలో చోటుచేసుకున్న క్రమశిక్షణ ఉల్లంఘన వంటి విషయాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో ఐక్యత, క్రమశిక్షణ, ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ ప్రజాప్రతినిధుల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!