
సినిమాలు

అయోధ్య విరాళాల నిధుల దుర్వినియోగాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ అభిషేక్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్య విరాళాల వ్యవహారాన్ని బయటపెట్టినందుకే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ పోలీసులతో కాకుండా సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని అభిషేక్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును కోరారు. విరాళాల నిధులపై తాను వెల్లడించిన అంశాల నేపథ్యంలోనే తనపై కేసు పెట్టారని ఆయన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసు తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!