
సినిమాలు

పెద్దపల్లి జిల్లా రామగుండంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. రామగుండంలోని అయోధ్యనగర్లో చేపట్టిన ఈ సోదాల్లో ఇంజినీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
అదుపులోకి తీసుకున్న ముజామిల్ ఖాన్ను రామగుండంలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అతడికి ఉన్న సంబంధాలు, ఇతర అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!