

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం మంగళవారం, ఆగస్టు 18 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే కొత్త ట్రాఫిక్ విధానంపై అవగాహన లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆలస్యమైంది. పీక్ అవర్స్‌లో రోడ్ నంబర్ 45, అగ్రసేన్, వెంకటేశ్వర్ నగర్ ప్రాంతాల్లో సమస్యలు గుర్తించినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం 500 మందికి పైగా సిబ్బందిని రహదారులపై మోహరించామని, ప్రత్యేక డ్రోన్లతోనూ ట్రాఫిక్‌ను పర్యవేక్షించామని సీపీ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అదనంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ అడ్వైజరీని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సజ్జనార్ కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!