
గాసిప్స్

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూఈటీ-యూజీ 2026 ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఐదు సబ్జెక్టుల్లో అత్యధిక స్కోర్లు సాధించిన తొలి 10 మంది జాబితాను కూడా ప్రకటించింది. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలు అద్భుత ప్రతిభ కనబర్చినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.
మొత్తం ఐదు సబ్జెక్టుల్లో నాలుగింటిలో ఒక అభ్యర్థి 100 పర్సంటైల్ సాధించగా, మూడు సబ్జెక్టుల్లో 22 మంది, రెండు సబ్జెక్టుల్లో 180 మంది, ఒక సబ్జెక్టులో 3,214 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. మే 11 నుంచి 31 వరకు, అలాగే జూన్ 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించగా, సుమారు 11.6 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాత్కాలిక కీపై అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది కీ విడుదల చేసి ఫలితాలను ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!