
జనరల్

ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన సతీమణితో కలిసి హైదరాబాద్‌లోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాలను సందర్శించారు. ఆలయాలకు చేరుకున్న దంపతులకు అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆషాఢ బోనాలు ప్రతీకగా నిలుస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఆలయాల్లో భక్తులతో కలిసి బోనాల సందడిని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!