
జనరల్

ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత మిస్ ఇండియా యూనివర్స్-2026 జాతీయస్థాయి అందాల పోటీలో ప్రతిభను చాటారు. ప్రతిష్ఠాత్మక పోటీలో ఆమె ఒకటో రన్నరప్‌గా నిలిచి సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించడం ద్వారా వైరాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.
నిఖిత సాధించిన విజయంపై వైరా, ఖమ్మం ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయి అందాల పోటీలో ఒకటో రన్నరప్‌గా నిలవడం ఆమె ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఆమె సాధించిన విజయానికి స్థానికంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!