
జనరల్

కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా భారత్ సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ విస్తరణ ప్రాజెక్ట్ కోసం దాల్మియా భారత్ సిమెంట్ సంస్థ రూ.3,100 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్లాంట్‌కు చేరుకున్న మంత్రి లోకేష్‌కు సంస్థ ఎండీ, సీఈవో పునీత్ దాల్మియాతో పాటు ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ప్లాంట్ విస్తరణతో క్లింకర్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల నుంచి 6.1 మిలియన్ టన్నులకు, సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 3.6 మిలియన్ టన్నుల నుంచి 9.6 మిలియన్ టన్నులకు పెరగనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కొత్తగా సుమారు 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!