
జనరల్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుత తరం బ్రెజ్జా మోడల్‌కు ఇది మిడ్-లైఫ్ అప్‌డేట్‌గా రానుంది. కంపెనీ ఈ వాహనాన్ని జులై 23న అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.11,000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించి ఈ అప్‌డేటెడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
మారుతి విడుదల చేసిన తొలి టీజర్ ప్రకారం, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో మొత్తం డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, ఎక్స్‌టీరియర్ స్టైలింగ్‌లో కొన్ని అప్‌డేట్స్ ఉండనున్నాయి. ఈ కొత్త మోడల్‌లో రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, సవరించిన ఎల్‌ఈడీ లైటింగ్ ఎలిమెంట్స్ వంటి మార్పులు కనిపించనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!