

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సోమవారం ఉదయం 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ఖైరతాబాద్ ‘పంచముఖ సంకటహర మహాగణపతి’కి తొలి పూజలు నిర్వహించారు. మహాగణపతి దర్శనానికి వచ్చిన గవర్నర్ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ నిర్వాహకులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలి పూజ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మహాగణపతిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం గవర్నర్ దంపతులు లోక్‌భవన్ సిబ్బంది క్వార్టర్స్‌లో లోక్‌భవన్ యువజన సంఘం నిర్వహించిన ప్రత్యేక గణేశ్ పూజలో పాల్గొన్నారు. అంతకుముందు లోక్‌భవన్ ప్రధాన భవనం, దర్బార్ హాల్‌లో ఏర్పాటు చేసిన గణేశుడికి తొలి పూజలు నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!