
జనరల్

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, వారిలో ముగ్గురు పంజాబ్‌కు, ఒకరు ఢిల్లీకి చెందినవారు అని పోలీసులు తెలిపారు. నిందితులు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుంచి రెండు విదేశీ పిస్టల్స్, తొమ్మిది తూటాలు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కుట్ర వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హ్యాండ్లర్ షెహ్జాద్ భట్టి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, కేసుపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) కోర్టు మరో 15 రోజుల గడువు మంజూరు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!