
క్రీడలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 12 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.
క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు విస్తరించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!