
గాసిప్స్

మేడిగడ్డ బ్యారేజీ కేసు విచారణను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి సమన్లు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. గతంలో జారీ చేసిన సమన్లు ఆయనకు అందకపోవడంతో తాజా నోటీసులు పంపాలని జిల్లా న్యాయవాదిని ఆదేశించింది.
అసలు పిటిషనర్ రాజలింగమూర్తి మృతి చెందినప్పటికీ కేసు విచారణ కొనసాగుతోంది. కేసు విచారణను కొనసాగించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను సెప్టెంబర్ 9న చేపట్టనున్నట్లు జిల్లా కోర్టు వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!