

ప్రభుత్వ ఉద్యోగుల సేవా వివరాలను డిజిటల్ రూపంలో నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ (ఈ-ఎస్ఆర్) 2.0ను అమల్లోకి తీసుకువస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యాప్‌లో ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, సర్వీస్ ఈవెంట్లు, పదోన్నతులు, రుణాలు, అడ్వాన్సులు, సెలవుల వివరాలు, ఎల్టీసీ, శాఖాపరమైన పరీక్షలు, శిక్షణ వివరాలు నమోదు చేయబడతాయి. ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్‌ను స్కాన్ చేసి అప్లోడ్ చేసిన అనంతరం ప్రతి సర్వీస్ ఈవెంట్‌ను నమోదు చేసి, ధృవీకరణ తర్వాత హెచ్ఆర్ మేనేజర్ తుది ఆమోదం ఇస్తారు. ఈ మాడ్యూల్ సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.
మరోవైపు, రాష్ట్ర సచివాలయం మరియు శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం లేదా గరిష్ఠంగా రూ.25,000 ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) కొనసాగించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. అమరావతిలో సీఆర్డీఏ క్వార్టర్స్ అందుబాటులోకి వచ్చే వరకు, 12వ పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు లేదా జూన్ 2027 వరకు, వీటిలో ఏది ముందైతే అప్పటి వరకు ఈ సౌకర్యం కొనసాగుతుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!