
సినిమాలు

మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాంగో ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 550కు పైగా ఎబోలా కేసులు నిర్ధారణ కాగా, 101 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం 309 మంది అనుమానిత రోగులు ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ఇటురి, నార్త్ కివు ప్రాంతాల్లో 35 కొత్త కేసులు నమోదవగా, 10 మంది మరణించారు. వ్యాధి నిర్ధారణలో ఇబ్బందులు, సమర్థవంతమైన చికిత్సా విధానాల కొరత సవాళ్లుగా మారాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రాంతీయ వ్యాప్తిపై హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో ఉగాండాలో 19 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!