

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తోంది. యర్రావారిపాలెం, చంద్రగిరి మండలాల పరిధిలో సుమారు 30 ఏనుగులు సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మూలపల్లి గ్రామంలో పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు కొబ్బరి, వరి, టమోటా, పశుగ్రాసం పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులను అడ్డుకునే ప్రయత్నంలో రైతు కేశవరెడ్డికి గాయాలయ్యాయి. ఆయన చేయి విరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు మూలపల్లి చెరువు పరిసరాల్లో తిష్టవేసినట్లు సమాచారం.
ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. చంద్రగిరి, యర్రావారిపాలెం, భాకరాపేట, తలకోన అటవీ ప్రాంతాల్లో ఏనుగుల కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల దగ్గరకు వెళ్లొద్దని, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని గ్రామస్తులను అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. తరచూ ఏనుగులు గ్రామాలు, పంట పొలాల్లోకి వస్తుండటంతో శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. కుంకీ ఏనుగులను వినియోగించి ఏనుగుల సంచారాన్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!