

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఒక్క అవకాశం ఇస్తే 2029 డిసెంబరు 31 నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘నషా ముక్త్ పంజాబ్’ లక్ష్యంతో బీజేపీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. జలంధర్‌లోని పరగ్పుర్లో బుధవారం జరిగిన ‘నషా ముక్త్ పంజాబ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలు చేశారు. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల విక్రయాలను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, కశ్మీర్లో ఉగ్రవాదం, దేశంలోని నక్సలిజంపై కేంద్రం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా పంజాబ్‌ను కూడా మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!