
రాజకీయాలు

ఇరాన్‌తో యుద్ధం ముగింపు విషయంలో అమెరికా–ఇజ్రాయెల్ మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా చర్చలకు మొగ్గు చూపుతుండగా, ఇజ్రాయెల్ మాత్రం దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్–నెతన్యాహు మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా అమెరికా ప్రతినిధులు ఇజ్రాయెల్ పర్యటనల్లో బర్నర్ ఫోన్లు, ప్రత్యేక పరికరాలు వాడుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ గూఢచర్య ముప్పును గుర్తించిన పెంటగాన్ తమ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ మరియు అమెరికా వైట్‌హౌస్ అధికారులు ఖండించారు. తప్పుడు, రాజకీయ ప్రేరేపిత వార్తలని వారు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా అత్యంత సన్నిహిత మిత్రదేశాలుగా ఉన్న అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాల్లో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!